మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నప్పుడు జనంలో నుంచి ఒక వ్యక్తి అకస్మాత్తుగా లేచి “నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లరు. ఆయన అక్కడే ఉంటారు” అని నినాదాలు చేయడం ప్రారంభించారు.
దీనిపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తండ్రిని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు బీజేపీ నేతల విమర్శలకు కారణమవుతున్నాయి.
Source: BBC Telugu World (Telugu)
