“దిల్లీ పోలీసులు నేహాను ఎక్కడికి తీసుకెళ్తున్నారో… ఇది అదుపులోకి తీసుకోవడం కాదు, అపహరించడమే.” అని నేహా ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు కనిపించింది. “పోలీసులు ఆమెను ఒక అనధికారిక వాహనంలో తీసుకెళ్లారు, అందులో ఒక్క మహిళా పోలీస్ కానిస్టేబుల్ కూడా లేరు. ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నారో మాకు తెలియదు. ఆమె గురించి మా వద్ద ఎలాంటి సమాచారం లేదు” అని ఏఎస్ఏ తెలిపింది.
Source: BBC Telugu World (Telugu)
