సినిమా ప్రదర్శితమవుతున్న చోట కన్నీళ్లు నిండిన ప్రజలను హీరాదేవి, పదం సింగ్ కలుసుకుంటున్నారు. కొంతమంది ప్రేక్షకులు వారి పాదాలను తాకి, కౌగిలించుకోవాలని కోరుకున్నారు. మరికొందరు, తాము పుట్టి పెరిగిన గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో తమ కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులను, మామ్మ, తాతయ్యలను ఈ సినిమా గుర్తు చేసిందని చెప్పారు.
Source: BBC Telugu World (Telugu)
