ఈ ప్రమాదంలో అయిదుగురు కార్మికులు మృతి చెందారని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మీడియాకు వెల్లడించారు. బాయిలర్ దగ్గర పని చేస్తున్న ముగ్గురు, పేలుడు వల్ల శిథిలాలు తగిలి సమీపంలో పని చేస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
Source: BBC Telugu World (Telugu)
