రెండు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వరి కోతల సమయం నడుస్తోంది. అక్కడ ప్రభుత్వం నిర్ధరించిన గిట్టుబాటు ధర కంటే, మిల్లర్లు అధిక ధర చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొంటున్నారు . క్వింటాలుకు కనీసంగా 500 రూపాయల నుంచి వివిధ మొత్తాల్లో రైతులకు ఎక్కువ చెల్లిస్తున్నారు. ఆ మేరకు రైతులకు లబ్ధి చేకూరుతోంది.
Source: BBC Telugu World (Telugu)
